Site icon NTV Telugu

దానికి కూడా కేసు పెడతారనే భయమేస్తోంది : అశోక్ గజపతిరాజు

నాపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టును ఆశ్రయించాను అని అశోక్ గజపతిరాజు తెలిపారు. నాపై నమోదు అయిన కేసులో పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రామతీర్ధంలో ఎన్నడూ లేని ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో జరగటం బాధాకరం. దేవస్ధానంకి సమర్పించే కానుకలకు కూడా మంత్రులు అనుమతులు అడుగుతున్నారు. మంత్రులు నా కుటుంబం, నా సంస్కారం కోసం మాట్లాడుతున్నారు. నా కుటుంబం దేశద్రోహి కుటుంబం అంటున్నారు. నన్ను విమర్శించే వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని తెలిపారు.

నేను ఆలయాలకు సంభందించి ఏ విషయం అడిగినా అధికారులు చెప్పటం లేదు. సింహాచలం దేవస్థానంకి వెళ్లే ముందు టోల్ గేట్ కూడా కట్టే వెళ్తున్నా అని చెప్పారు. నేను టోల్ గేట్ కట్టకపోతే కేసు పెడతారనే భయమేస్తోంది అని చెప్పిన ఆయన నన్ను కేసులతో వేధిస్తున్నారు అని పేర్కొన్నారు.

Exit mobile version