Site icon NTV Telugu

APSRTC: అద్దె బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించిన ఏపీఎస్‌ఆర్టీసీ

Apsrtc

Apsrtc

రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. 203 పల్లె వెలుగు, 208 ఆల్ట్రా పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్, 70 ఎక్స్‌ప్రెస్, 22 అల్ట్రా డీలక్స్, 46 సూపర్ లగ్జరీ, 9 ఏసీ స్లీపర్, 47 నాన్ ఏసీ స్లీపర్, 6 ఇంద్ర బస్సులు, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జిల్లాల వారీగా అద్దె బస్సులు, సంఖ్యను నిర్ణయించి ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బిడ్లు దాఖలు చేయాలని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి కోరారు. MSTC ఈ-కామర్స్‌ పోర్టల్‌ ద్వారా టెండర్ల ప్రక్రియ చేపడతామన్నారు.

Read Also: టూరిస్టులకు అనుమతి లేని 10 అందమైన ప్రదేశాలు

జిల్లాల వారీగా అద్దెకు తీసుకుంటున్న బస్సుల వివరాలు: శ్రీకాకుళం-39, మన్యం-32, విజయనగరం-14, విశాఖ-61, అనకాపల్లి-22, కాకినాడ-41, తూ.గో-27, కోనసీమ-39, ప.గో-52, ఏలూరు-21, కృష్ణా-28, ఎన్టీఆర్-12, గుంటూరు-26, పల్నాడు-30, బాపట్ల-6, ప్రకాశం-10, నెల్లూరు-39, తిరుపతి-35, చిత్తూరు-2, అన్నమయ్య-10, వైఎస్ఆర్-6, నంద్యాల-29, కర్నూలు-14, అనంతపురం-31, సత్యసాయి-33

Exit mobile version