టూరిస్టులకు అనుమతి లేని 10 అందమైన ప్రదేశాలు

అక్సాయ్ చిన్: ఇది భారత్, చైనాను వేరు చేసే విరమణ రేఖ ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) అని అంటారు

బారెన్ ద్వీపం: ఇక్కడ నిప్పులు చిమ్మే అగ్నిపర్వతం ఉంది. భద్రతా ప్రమాణాలతో చిన్న షిప్‌లో వెళ్లి, నిర్ణీత దూరం నుంచి చూడ్డానికే వీలుంది

Fill in బస్తర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న బస్తర్ జిల్లాలో ఎన్నో పర్యాటక ఆకర్షణలున్నాయి. కానీ.. ఇక్కడ ప్రమాదకరమైన నక్సలైట్లు ఎక్కువtext

తురా: మేఘాలయలో ఉండే ఈ పట్టణంలో ఎన్నో ప్రకృతి సౌందర్యాలున్నాయి. అయితే.. ఇక్కడ ఉగ్రవాదులు ప్రమాదం ముంచుకొని ఉంటుంది

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్: కేరళలోని సుందరమైన ప్రదేశాలలో ఇదొకటి. ఇటీవల మావోయిస్టుల దాడి కారణంగా పర్యాటకుల రాకపోకలు పడిపోయాయి

ఫుల్బని: ఒడిశాలోని ఉంటే ఈ చిన్న పట్టణం ప్రకృతి అందాలకు నిలయం. అయితే, ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి

నికోబార్ ద్వీపం: అండమాన్ మాదిరిగా ఈ దీవుల్లో పర్యటించేందుకు అవకాశం ఉండదు. కారణం.. ఇక్కడ గిరిజన సమూహాలు ఎక్కువ

మానస్ నేషనల్ పార్క్: అస్సాంలో ఉన్న ఈ పార్క్‌లో.. 2011లో 6గురు WWF అధికారులను బోడో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు

హఫ్లంగ్: అస్సాంలోని ఉత్తర కచర్ పర్వతాల నడిబొడ్డున ఈ ప్రాంతం ఉంది. ఉగ్రవాద సంస్థల కారణంగా ఇక్కడి పర్యాటక రంగం అవరోధాలను ఎదుర్కొంటోంది

చంబల్ నది: ఇది మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లో ఉంది. బందిపోటు దొంగల కారణంగా ఈ ప్రాంతం పర్యాటక సందర్శనకు దూరమైంది