Site icon NTV Telugu

Controversial Decision: ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం.. మండిపడుతోన్న శ్రీవారి భక్తులు

Rtc 2

Rtc 2

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల కిక్కిరిసిపోనుంది.. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్‌ఆర్టీసీ, తిరుపతి విభాగం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం రచ్చగా మారుతోంది.. ఆర్టీసీ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడుతున్నారు.. అసలు, శ్రీవారి దర్శనానికి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధం ఏంటి? అని మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు. అయితే, వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యల్లో తరలివచ్చే అవకాశం ఉండడంతో.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ఓవైపు ప్రత్యేక దర్శనం టికెట్లు.. మరోవైపు సర్వదర్శనం టోకెన్లు.. ఇలా భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్లాన్‌ వేసింది.. సామాన్యుల భక్తులకు పెద్దపీట వేస్తామని చెబుతున్నారు టీటీడీ అధికారులు.. ఇదే సమయంలో.. టికెట్లు, టోకెన్లు ఉంటేనే తిరుమలకు రావాలని స్పష్టం చేశారు. ఈ తరుణంలో.. ఆర్టీసీ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

Read Also: Off The Record about GVL: సీటు కోసం కోటి ఎత్తులు..! విశాఖపై జీవీఎల్‌ కన్నేశారా?

Exit mobile version