Site icon NTV Telugu

Bus Catches Fire: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు..

Bus Catches Fire

Bus Catches Fire

ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించింది… కృష్ణా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.. విజయవాడ నుండి గుడివాడ వెళ్తున్న గుడివాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం సమీపానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది.. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి… నిమిషాల వ్యవధిలో బస్సు మొత్తం వ్యాపించాయి.. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నారు.. మంటలు చెలరేగడంతో.. ఆందోళనకు గురైన.. కేకలు వేశారు.. అయితే, అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును ఆపివేయడం.. అందరూ బస్సు నుంచి క్షణాల్లో దిగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది… బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు చెలరేగినట్టు ఆ బస్సు డ్రైవర్‌ చెబుతున్నారు.. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.. అయితే, ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నా.. ఇలా ఒన్నట్టుండి మంటలు చెలరేగిన ఘటనలు చాలా అరుదనే చెబుతున్నారు అధికారులు.. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది..

Read Also: Rahul Gandhi: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు.. స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన రాహుల్‌

Exit mobile version