NTV Telugu Site icon

P Gowtham Reddy: చిన్న సినిమాల కోసమే ఏపీ ఫైబర్.. 39 రూపాయలకే!

P Gowtham Reddy Ap Fibernet

P Gowtham Reddy Ap Fibernet

APSFL Chairman P Gowtham Reddy Talks About AP Fiber Movie System: మొదటి రోజే మొదటి షో అనే ప్రాతిపదికన.. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా సినిమాలను అందించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పీ. గౌతంరెడ్డి తెలిపారు. అందుకే సినిమాల్ని తక్కువ ధరకే ప్రజలకు వినోదాన్ని అందించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఇతర ఓటీటీ యాప్‌లకు, థియేటర్లకు.. ఏపీఎస్ఎఫ్ఎల్ పోటీ కాదని క్లారిటీ ఇచ్చారు. చిన్న సినిమాలకు పెద్దగా థియేటర్లు దొరకడం లేదన్న ఆయన.. ఒక పెద్ద సినిమా రిలీజైనప్పుడు, చిన్న సినిమాల్ని ఏపీ ఫైబర్ ద్వారా రూ.39కే విడుదల చేస్తున్నామన్నారు. ఇక పెద్ద సినిమాలకు ఎలాగో విడుదల సమయంలో.. టికెట్ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు.

MVV Satyanarayana: మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేధించారు.. నా ఫ్యామిలీ క్షేమం

ఏపీ ఫైబర్ ద్వారా విడుదల చేసే సినిమాలను ఏమాత్రం పైరసీకి గురవ్వకుండా.. సాంకేతిక జాగ్రత్తలు తీసుకున్నామని గౌతంరెడ్డి వెల్లడించారు. ఒకవేళ ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం కలిగించే కంటెంట్ ఉంటే.. ముందుగా దాన్ని స్క్రీనింగ్ చేస్తామని, ఆ తర్వాతే విడుదల చేస్తామని చెప్పారు. ఏపీ ఫైబర్‌కు ఉన్న 10 లక్షల మంది వినియోగదారుల్లో.. ఎక్కువ మందికి వినోదాన్ని కల్పించడమే తమ లక్ష్యమన్నారు. త్వరలోనే ఏపీ ఫైబర్ తరఫన ఓటీటీ తరహాలో ఒక యాప్ తీసుకొస్తామన్నారు. ఆరు నెలల్లో ఆ యాప్‌కు వచ్చే రెస్పాన్స్‌ని బట్టి.. ఇతర వీడియో కంటెట్‌ని సైతం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ కంపెనీగా ఆర్థిక పరిస్థితి సహకరిస్తే.. భవిష్యత్‌లో సినిమాలను కూడా నిర్మిస్తామన్నారు. ఈ విధానంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఒకరిద్దరి నుంచి వ్యతిరేకత వచ్చినా.. పరిశ్రమకు నష్టం ఉండదని మిగిలిన వారు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. వెబ్ సిరీస్, టెలిఫిలిమ్‌ల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

CM YS Jagan: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు