ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎండికి లేఖ రాసింది. ఏపీపీటీడీ సంస్థలో క్లరికల్ సిబ్బందికి సంబంధించి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీలలో ఉద్యోగులకు పదోన్నతి కల్పించి ఖాళీలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిటైర్ అయ్యే ఉద్యోగులను నియమిస్తు.. వీరందరికి లేబర్ డిపార్ట్ మెంట్ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read:Lavanya: నన్ను వాళ్లు చంపేస్తారు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు..
దీనిపై యూనియన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆర్టీసిలో ఉన్న క్లరికల్ సిబ్బంది ఖాళీలలో రిటైర్డు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకోవాలని కోరింది. క్లరికల్ సిబ్బంది ఖాళీలలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రెవేశపెడితే దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతుందని లేఖలో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఆర్టీసిలో పదోన్నతులకు నోచుకోలేదు. అధికారులు పోస్టుల ఖాళీలు వస్తే సీనియర్లకు ఇన్ చార్జులుగా ఇస్తున్న మాధిరిగానే క్రింది స్దాయి ఉద్యోగులకు ఇవ్వాలన్నారు. ఆర్టీసిలో పదోన్నతులలో అధికారులకు ఒకన్యాయం, ఉద్యోగులకు ఒకన్యాయం సరికాదన్నారు.