Site icon NTV Telugu

APPSC: రిక్రూట్ మెంట్ పారదర్శకంగా వుండాలి

Appsc 1

Appsc 1

ఏపీలో తరచూ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల యాన్యువల్ రిపోర్టులను గవర్నరుకు సమర్పించారు గౌతమ్ సవాంగ్. ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ తీసుకుంటున్న చర్యలని వివరించారు గౌతమ్ సవాంగ్. ఈసందర్భంగా గవర్నర్ పలు సూచనలు చేశారు.

గ్రూప్-1 ఆభ్యర్థుల అభ్యంతరాలను గౌతమ్ సవాంగ్ వద్ద గవర్నర్ ప్రస్తావించినట్టు సమాచారం. అంతకుముందే గ్రూప్ వన్ అభ్యర్ధులు గవర్నర్ ని కలిసిన సంగతి తెలిసిందే. వారు గవర్నర్‌ దగ్గర వున్నప్పుడు అక్కడికి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ అక్కడే వున్నారు. గ్రూప్-1 గందరగోళంపై గవర్నర్ ఆరా తీసినట్టు సమాచారం.

ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, నోటిఫైడ్ ఖాళీల భర్తీని టైమ్ బౌండ్ ప్రకారం చేపట్టాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గౌతమ్ సవాంగ్ కి సూచించారు. నిరుద్యోగులకు మేలు చేకూర్చేలా ఏపీపీఎస్సీ పని తీరు ఉండాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గ్రూప్ వన్ వివాదం నేపథ్యంలో గవర్నర్‌ తో గౌతమ్ సవాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ సూచనల తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్

Exit mobile version