Site icon NTV Telugu

దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుంది : శైలజానాథ్‌

కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్‌ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దేశంలో సెక్యులరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే అని, రాష్ర్టాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పనిచేస్తుందన్నారు. రాష్ర్ట రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని, రెండు రాజధానులు అనేది అవకాశవాధమని ఆయన అన్నారు.

చంద్రబాబు, జగన్ ఒప్పుకొనే రాష్ర్ట రాజధాని మొదలుపెట్టారని ఆయన వెల్లడించారు. శ్రీబాగ్ ఒడంబడిక అమలు కావాలని, రాయలసీమకు నీళ్లు, హైకోర్ట్ కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్రను నాశనం చేయకుంటే చాలు.. విశాఖపట్నాన్ని దోచుకోకుంటే చాలు.. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version