ఏపీలో అసమర్థత పాలన సాగుతోందని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజా నాథ్ మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శైలజా నాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలను పరిశీలించారు. అనంతరం తులసి రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అసమర్థత పాలన సాగుతోందని శైలజా నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో పట్టుమని పది ఇళ్లు కూడా కట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఆడంబరం, ఆర్భాటం,అణచివేత కార్యక్రమాలు మాత్రమే జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు.
Read Also: Lorry Thief: ఏకంగా లారీనే ఎత్తుకెల్లారు.. ఇప్పటికి మూడు మాయం
జగన్ పాలనలో యువతకు కొత్త ఉద్యోగాలు లేవని , రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని అన్నారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. జగన్ పాలనలో SC లకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిందని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. నరేంద్ర మోడీకాళ్లు చూడడం తప్ప కనీసం మొహంలోకి కూడా చూడలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతోందన్నారు. డిసెంబర్ నెలలో అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు కాంగ్రెస్ పార్టీ తన పాదయాత్ర కొనసాగించబోతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం అయిందన్నారు.
Read Also: Viral Photo: ఇది యూనివర్సిటీ క్యాంపస్ కాదు.. రైల్వేస్టేషన్..!!