AP Weather Update: ఏపీలో రానున్న 5 రోజులు వింత వాతావరణం..
- ఏపీలో మిశ్రమ వాతావరణం.. వర్షం, ఎండల కలయిక
- ఉరుములు, మెరుపులతో వర్షాలకు ఐఎండీ హెచ్చరిక
- ఈదురుగాలులు పెరుగుతాయి.. గాలి వేగం 50 కిమీ వరకు
- రైతులు, ప్రజలకు ముఖ్య సూచనలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు మిశ్రమ వాతావరణం ఉండబోతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాష్ట్రంలో ద్రోణి బలహీనపడినప్పటికీ, సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగనుండటం గమనార్హం.
10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
Also Read
సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర , దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మొదటి మూడు రోజులు గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉండగా, నాలుగో రోజు తర్వాత ఈదురుగాళ్ల ఉధృతి పెరిగి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గదని ఐఎండీ స్పష్టం చేసింది. రాబోయే ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా క్యూములో నింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావం ఉన్న చోట వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana : ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా.. ఈ బెనిఫిట్ ఎవరికి వస్తుందంటే..?
ఇవి విస్తారంగా కురిసే వర్షాలు కానప్పటికీ, ఈదురుగాలుల వల్ల మామిడి వంటి పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రజలు.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎత్తైన చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ఈ వర్షాలు సాధారణంగా గంట లేదా రెండు గంటల పాటు మాత్రమే ఉండి తర్వాత తగ్గుతాయని తెలిపారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ మిశ్రమ వాతావరణం మరో ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!