NTV Telugu Site icon

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం..!

Polavaram

Polavaram

పోలవరం ప్రాజెక్టు పనులు వరదలు ఉన్నందున కాస్త నెమ్మదించాయి.. ఇక నుంచి వేగవంతం చేస్తామన్నారు ఏపీ జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌.. బ్యాక్ వాటర్‌పై ఉమ్మడి సర్వే అనేది ఉండదన్న ఆయన.. అన్ని అంశాలపై ఆమోదం వచ్చాకే కేంద్రం, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఇప్పుడు తెలంగాణ అభ్యంతరాలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు.. హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశం జరిగింది.. ప్రాజెక్టు నిర్మాణం, బ్యాక్ వాటర్ ముంపు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం రాజమండ్రికి తరలింపు అంశాలు తదితర అంశాలపై చర్చ సాగింది.. సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో పాటు కేంద్ర జలశక్తి అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏపీ జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషన్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్ లో 15 అంశాలపై చర్చించాం.. ప్రాజెక్టు పనులు వరదలు ఉన్నందున కాస్త నిమ్మదించాయి… ఇక నుంచి వేగవంతం చేస్తామని.. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నామన్నారు.

Read Also: Balanagi Reddy: పవన్‌ను చంద్రబాబు దత్తత తీసుకునే ప్రయత్నం..! వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..

ప్రాజెక్టు కాపర్ డ్యామ్ పనులు జనవరి చివరి నాటికి పూర్తవుతాయి.. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పనులు కొలిక్కి వస్తాయి. గ్యాప్ వన్ పూర్తవుతుందన్నారు శశిభూషణ్‌.. పోలవరం బ్యాక్ వాటర్ ఉమ్మడి సర్వే అనేది ఉండదన్న ఆయన.. అన్ని అంశాలపై ఆమోదం వచ్చాకే కేంద్రం, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పుడు అభ్యంతరాలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు.. పోలవరం ముంపు భూసేకరణ కొంత పెండింగ్ ఉంది. అది కూడా పూర్తవుతుందని తెలిపారు.. వర్కింగ్ సీజన్ లో పోలవరం ప్రాజెక్టు పనుల లక్ష్యాలు, వనరులపై పీపీఏ సమావేశంలో చర్చించామని.. వర్కింగ్ సీజన్ లో పనుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదించామన్న ఆయన.. దిగువ కాపర్ డ్యాం పనులను జనవరి నెలాఖరు వరకు పూర్తి చేస్తాం.. ప్రధాన డ్యాంకు సంబంధించిన పనుల ప్రారంభం కోసం డయాఫ్రామ్ వాల్ పరిస్థితిని పరీక్షిస్తాం.. 2023 జూన్ వరకు ప్రధాన డ్యాం పనులు గ్రౌండ్ లెవల్ వరకు తీసుకొస్తామని.. ప్రధాన డ్యాం గ్యాప్ పనులను 2023 డిసెంబర్ వరకు పూర్తి చేస్తాం అన్నారు.

ఇక, అన్ని అంశాలను అధ్యయనం చేశాకే పోలవరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు వచ్చాయి.. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు, ఎవరూ అంగీకరించలేదన్నారు శశిభూషణ్‌.. మ్మడి అధ్యయనం, సర్వే అంటూ ఏదీ ఉండదు.. జాతీయ ప్రాజెక్టుకు అనుమతులు రావడం పిల్లచేష్టలు కాదు కదా? అని ప్రశ్నించారు. ఎప్పటి వరకు అధ్యయనం చేసుకుంటూ పోవాలి? నచ్చినట్లు నివేదికలు వచ్చే వరకు అధ్యయనం చేయాలా? తెలంగాణ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలించి సమాధానం ఇస్తామని పీపీఏ స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం ఉంది. ఎలాంటి తాత్కాలిక, శాశ్వత ఉత్తర్వులు రాలేదన్నా యన.. అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు తెలిపింది.. రెండు సమావేశాలు జరిగినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదు.. ఏకాభిప్రాయం కోసం త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారన్నారు.. భూసేకరణపై కూడా పీపీఏ సమావేశంలో చర్చ జరిగింది.. రెండో దశలో మరో 30 నుంచి 40 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని.. అందుకోసం షెడ్యూల్ సిద్ధం చేసి ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని అందరూ కోరుతున్నారు.. రాజమహేంద్రవరంలో వసతి కోసం పరిశీలిస్తున్నామని వెల్లడించారు ఏపీ జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌.

Show comments