NTV Telugu Site icon

దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఏపీ వేరియంట్… 

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది.  రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు.  ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి.  ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు.  ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.  వీలైనంత  వరకు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని నిపుణులు పేర్కొంటున్నారు.