Site icon NTV Telugu

Pawan Kalyan: వికసిత్ భారత్ 2047లో ఏపీది కీలక పాత్ర

Pawan

Pawan

Pawan Kalyan: అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధన దిశగా రాష్ట్రం శక్తివంతమైన అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఈ మార్గదర్శక ప్రస్థానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వమే ప్రధాన శక్తిగా మారిందన్నారు. ఇక, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారంతో రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి బలమైన భవిష్యత్ రూపుదిద్దుకుంటోందని పవన్ స్పష్టం చేశారు.

Read Also: Delhi: ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన

అయితే, వికసిత్ భారత్ 2047లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్ర లక్ష్యమే గమ్యంగా రాష్ట్రం ప్రతి రంగంలో శక్తివంతంగా ముందుకు కొనసాగుతుందని పేర్కొన్నారు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ మధ్య అనుబంధం గత దశాబ్దకాలంగా బలంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్థిక, సాంకేతిక, శ్రామిక రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించి, రాష్ట్రానికి గ్లోబల్ సహకారం అందించేందుకు తాను మరింత కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. సింగపూర్ నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో సంబంధాలు మరింత బలపడాలనే డిప్యూటీ సీఎం పవన్ ఆకాంక్షించారు.

Exit mobile version