TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్‌పర్సన్ల జాబితా విడుదల..

  • 66 పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల
  • ఏడు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ స్థానాలు
  • 59 పట్టణాల్లో వైస్ చైర్‌పర్సన్ పదవులు
  • చంద్రబాబు పేరుతో టీడీపీ ప్రకటన
Tdp

Tdp

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ల స్థానాల జాబితాను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరుతో ఈ జాబితాను ప్రకటించారు. రెండు పేజీలతో కూడిన ఈ జాబితాలో మొత్తం 66 పట్టణ స్థానిక సంస్థల వివరాలను పొందుపరిచారు.

7 కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ స్థానాలు

తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులను కేటాయించారు. వీటిలో అనంతపురం, చిత్తూరు, కడప, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, విజయనగరం కార్పొరేషన్లు ఉన్నాయి.

59 పట్టణాల్లో వైస్ చైర్‌పర్సన్ల స్థానాలు ఇవే

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మొత్తం 59 వైస్ చైర్‌పర్సన్ స్థానాలను గుర్తించారు. అద్దంకి, ఆదోని, ఆళ్లగడ్డ, అమలాపురం, ఆత్మకూరు, బద్వేలు, చిలకలూరిపేట, చీమకుర్తి, చీరాల, దర్శి, డోన్, గిద్దలూరు, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, ఇచ్ఛాపురం, జమ్మలమడుగు, కదిరి, కళ్యాణదుర్గం, కనిగిరి, కుప్పం, మాచర్ల, నగరి, నంద్యాల, నరసాపురం, నిడదవోలు, నూజివీడు, పెడన, పెద్దాపురం, పెనుకొండ, పిడుగురాళ్ల, ప్రొద్దుటూరు, పులివెందుల, పుంగనూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజంపేట, రాయచోటి, సాలూరు, సామర్లకోట, సూళ్లూరుపేట, తాడిపత్రి, తెనాలి, తిరువూరు, తుని, వెంకటగిరి, వినుకొండ, యలమంచిలి, ఏలేశ్వరం, ఎమ్మిగనూరు, ఎర్రగుంట్ల, దాచేపల్లి, గూడూరు, గురజాల, కమలాపురం, మడకశిర, ముమ్మిడివరం, నెల్లిమర్ల, పాలకొండ పట్టణాల్లో ఈ స్థానాలను కేటాయించారు.