Site icon NTV Telugu

Atchannaidu: వైసీపీకి సవాల్.. 175 స్థానాల్లో గెలిస్తే టీడీపీ ఆఫీస్‌కు తాళం

Atchannaidu

Atchannaidu

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంద‌ని జ‌గ‌న్‌కు అంత నమ్మకమేంటని ప్రశ్నించారు. నిజంగా అంత నమ్మకం ఉంటే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. తక్షణమే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని జగన్ 175 స్థానాలు వస్తాయని కలలు కంటున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు.

Nara Lokesh : ప్రిజనరీ జగనుకు చేతకాక విద్యా వ్యవస్థ నాశనం

మరోవైపు జూమ్ పాలిటిక్స్‌పై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్, వైసీపీ నేతల జీవితాలే ఫేక్ అన్నారు. తమ జూమ్ సమావేశంలోకి వైసీపీ వాళ్లు దొంగల్లా జొరబడ్డారని ఎద్దేవా చేశారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సులోకి వైసీపీ వాళ్లు వచ్చారన్నారు. మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెడితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోనే చీపుర్లతో కొడతారని.. ముఖాన ఉమ్మేస్తారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మలు, పనికి మాలిన వెధవలు తమ జూమ్ మీటింగ్‌లోకి జొరబడ్డారన్నారు. తమ జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పాస్ కాని వెధవలు జూమ్ కాన్ఫరెన్స్‌లోకి వచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు తప్పలేదా..? కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోలేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు మనో ధైర్యం కల్పించాలని తాము కాన్ఫరెన్స్ పెడితే దొంగల్లా వచ్చారన్నారు. విద్యార్ధులు తప్పలేదని.. ఆత్మహత్యలు చేసుకోలేదంటే తాము క్షమాపణ చెప్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.

Exit mobile version