NTV Telugu Site icon

US: అమెరికాలో ఏపీ విద్యార్థి గుండెపోటుతో మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు

Usdied

Usdied

అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి ముత్తిన రమేష్ గుండెపోటుతో మృతిచెందాడు. రమేష్ యూఎస్‌లో ఎమ్మెస్ డిగ్రీ చదువుతున్నాడు. మృతుడు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు. గడిచిన నాలుగు నెలల్లోనే ఒకే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెస్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రమేష్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల అమెరికాలో భారతీయ విద్యార్థులు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయా కారణాలతో ఇప్పటికే అనేక మంది మృత్యువాత పడ్డారు. తాజా పరిణామంతో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరింత భయాందోళన చెందుతున్నారు.

Show comments