Site icon NTV Telugu

AP SSC Results 2023: నేడే టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

Ap Ssc Results

Ap Ssc Results

AP SSC Results 2023: టెన్త్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అయితే, టెన్త్‌ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ రోజు పదవ తరగతి ఫలితాల విడుదల చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో టెన్త్‌ ఫలితాలను ప్రకటించనున్నారు.. కాగా, గత నెల 18న పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి.. రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ చేపట్టారు. స్పాట్ వ్యాల్యుయేషన్ వేగంగా పూర్తిచేశారు అధికారులు. ఇప్పుడు ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, టెన్త్‌ ఫలితాల కోసం.. https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి.. హోమ్ పేజీలో అందుబాటులో ఏపీ టెన్త్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి… హాల్ టికెట్ వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే.. రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. ఫలితాలను ప్రింట్‌ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మరోవైపు. manabadi.co.in లాంటి వెబ్‌సైట్లలో కూడా ఏపీ పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంచనున్నారు.

Exit mobile version