Site icon NTV Telugu

Exams: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. నో ఫోన్ జోన్లుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు

Tenth Exams Min

Tenth Exams Min

ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతిరోజూ పేపర్ లీక్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి పేపర్ లీక్‌లు కాదని మాస్ కాపీయింగ్ జరుగుతోందని విద్యాశాఖ వివరణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేలా చర్యలు చేపట్టింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్‌లను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు నిరాకరించింది.

పరీక్షా కేంద్రాల్లో ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా కన్పిస్తే వెంటనే జప్తు చేస్తామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్లు, ఐపాడ్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని స్పష్టం చేసింది. క్వశ్చన్ పేపర్లోని ప్రతి పేజీ మీద సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలెటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే అభ్యర్థులతో సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ రాయించాలని సూచించింది. పరీక్ష నిర్వహణలో ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Andhra Pradesh: 52 మంది అదనపు ఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ

Exit mobile version