Site icon NTV Telugu

Andhra Pradesh: భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. థియేటర్లకు ముందస్తు హెచ్చరికలు

ఈనెల 25న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా థియేటర్ల యజమానులకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని.. బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పలు థియేటర్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు తప్పవంటూ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు తహసీల్దార్ హెచ్చరించారు. ఆయన జారీ చేసిన నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ రెవెన్యూ అధికారులు, పోలీసులు థియేటర్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వీఆర్వోలను థియేటర్ల వద్దకు పంపి జీవో నంబర్ 35 అమలు అవుతుందో లేదో తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Exit mobile version