Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూప్ చేపడుతున్న ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అదనంగా 1.3 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సుజ్లాన్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందని నారా లోకేష్ వెల్లడించారు. ఉరుకొండ వద్ద ఉన్న బ్లేడ్ల తయారీ యూనిట్ విస్తరణతో పాటు కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 4,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 2016లో ప్రారంభమైన అనంతపురం సుజ్లాన్ ప్లాంట్ ద్వారా ఇప్పటికే సుమారు 2,000 మందికి ఉపాధి లభించిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది స్థానిక యువత ఉండటం సంతోషకరమన్నారు. స్థానిక ఐటీఐలను దత్తత తీసుకుని శిక్షణ అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
సుజ్లాన్ సంస్థ వర్క్‌ఫోర్స్‌లో 40 శాతం మంది మహిళలు ఉండటం అభినందనీయమని నారా లోకేష్ అన్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరగడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో నెలవారీ సమావేశాలు నిర్వహించి పరిశ్రమలకు ఎదురయ్యే సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పెట్టుబడులు ఆలస్యం కాకుండా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేసి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!