మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే, చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండడంతో.. ఇప్పుడే మా వళ్ల కాదంటూ చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి.. ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కాగా, పెద్ద సంఖ్యలో యూత్ రిజిస్ట్రేషన్ చేసుకునే పనిలో పడిపోయారు.. వారి తాకిడికి సర్వర్లే మోరాయించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పట్లో సాధ్యం కాదనే వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ దానిపై క్లారిటీ ఇచ్చారు.. మే నెల నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలని ఆదేశాలున్నాయన్న ఆయన. కానీ, 45 ఏళ్లు దాటినవారికే చాలా మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు.. 18-45 మధ్య వయస్సు వారికి టీకాల నిమిత్తం 4.08 టీకా డోసులు అవసరం అని.. టీకాలు ఇచ్చే విషయంలో ఎదురవుతోన్న ఇబ్బందులను వివరిస్తూ ప్రధాని మోడీకి, సీఎం వైఎస్ జగన్‌కు లేఖలు రాయబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 18-45 మధ్య ఏజ్ గ్రూప్‌కు కోవిడ్ టీకాల పంపిణీని ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు..
18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ
Anil Kumar Singhal