NTV Telugu Site icon

Vangaveeti Radha Krishna: వంగవీటి చుట్టూ ఏపీ రాజకీయం..!

Vangaveeti Radha

Vangaveeti Radha

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో విశాఖ వేదికగా జరుగుతోన్న కాపునాడు సభ చర్చగా మారింది.. అయితే, కాపునాడు సభకు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉన్నాయి.. జనసేన పార్టీ నేతలు మాత్రం హాజరుకాబోతున్నారు. దీంతో, ఈ సభలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.. వంగవీటి మోహనరంగ పోరాటం స్ఫూర్తిగా కార్యాచరణ ప్రకటించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు ప్రతినిధులు ఈ సభకు తరలివస్తున్నారు.. రాజకీయాలకు అతీతమే అని చెప్పినప్పటికీ.. ఈ సభకు వివిధ పార్టీల్లో ఉన్న కాపు ప్రతినిధులు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. మరోవైపు.. వంగవీటి చుట్టూ ఏపీ రాజకీయం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.. మొత్తంగా విశాఖ సాగరతీరాన్న జరుగుతోన్న కాపునాడు బహిరంగ సభ పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది..

Read Also: CM YS Jagan Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం జగన్

దివంగత నేత వంగవీటి మోహన్ రంగా జయంతిని పురస్కరించుకుని వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 34ఏళ్ళ తర్వాత మరోసారి కాపునాడు జరగనుంది. కాపుల ఐక్యత ప్రధానంగా తలపెట్టిన ఈ సభలో ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎంవీపీ కాలనీలోని ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో భారీ డయాస్ ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కాపుల పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? అనే విషయాలు చర్చించకుండా సభ సాగదు అని అంటున్నారు. ఈ సభకు సంబంధించి వైసీపీ మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. అంతే కాదు వారి ఫోటోలను కూడా ఆహ్వాన పత్రాలలో ముద్రించడం విశేషం. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాథ్, విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖఅనకాపల్లి వైసీపీ జిల్లాల ప్రెసిడెంట్లు అయిన పంచకర్ల రమేష్ బాబు కరణం ధర్మశ్రీలతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి. కానీ, వీరు ఎవరూ ఈ సభకు రావడంలేదని తెలుస్తోంది.

కాగా, వంగవీటి రంగా హత్యపై అదే సమయంలో ఆయన కుమారుడు వంగవీటి రాధాపై ఈ మధ్యే సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాని నాని… కృష్ణా జిల్లా నున్నలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్న కొడాలి నాని.. రంగాను హత్య చేసేందుకు ఆయన శత్రువులు 1983లో టీడీపీలో చేరారని వ్యాఖ్యానించారు. రంగాను భూమి లేకుండా చేయాలనే కుట్రతో హత్య చేశారని చెప్పారు. రంగాను చంపిన దుర్మార్గులు ప్రస్తుతం ఎంత దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇక, ఎమ్మెల్యేగా వంగవీటి రంగా మూడేళ్లు పని చేసినా ఎంతో ఖ్యాతి గడించారని చెప్పుకొచ్చిన ఆయన.. డబ్బులిస్తామన్నా, రాజ్యసభ సీటులాంటి పదవులిస్తామన్నా వంగవీటి రాధా లొంగడని కొనియాడారు.. అయితే, ఇవాళ జరుగుతోన్న కాపు నాడు సభకు మాత్రం వైసీపీ నేతలు దూరంగా ఉంటున్నారు.. ఏదేమైనా.. వంగవీటి రాజీకయంపై ఆసక్తి నెలకొంది.