NTV Telugu Site icon

Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ అరెస్టుకు యత్నం

Akhila Priya1

Akhila Priya1

మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ముందస్తు అరెస్టుకు పోలీసులు యత్నించారు. బుధవారం భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే అదే ఊర్లో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. దీంతో అఖిల ప్రియను ఆ ఊరికి వెళ్లకుండ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఆమె కారును అడ్డుకున్నారు.

Also Read: MLA Yatnal: 40,000 కోట్ల కోవిడ్ కుంభకోణంలో యడ్యూరప్ప ప్రమేయం ఉంది..

తను వెళ్లడం వల్ల అక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అఖిల ప్రియకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె పట్టు వీడకపోడంతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు. అఖిల ప్రియ అరెస్టుకు పోలీసులు యత్నించడంతో అక్కడికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: Success Story : ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి.. డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న యువరైతు..

Show comments