NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Mobile: వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు..

Vamshi

Vamshi

Vallabhaneni Vamsi Mobile: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండవ రోజు పడమట పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు సోదాల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫూటేజీని సేకరించారు. వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ రోజు వల్లభనేని వంశీ సెల్‌ఫోన్ కోసం గాలించిన పడమట పీఎస్ పోలీసులు.. సుమారు నలభై నిమిషాల పాటు గాలించారు.

Read Also: Nidhhi Agerwal : బ్యూటిఫుల్ మేకోవర్ తో నిధి అగర్వాల్ ‘కొల్లగొట్టినాదిరో’

అయితే, హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో సెల్‌ఫోన్ లభించకపోవడంతో పడమట పోలీసులు తిరిగి వెళ్ళిపోయారు. వంశీ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఫోన్ కోసం వంశీ ఇంటిని జల్లెడ పట్టారు. చివరి లొకేషన్ భూజా లొకేషన్ చూపించడంతో ఇంట్లో సోదాలు చేశారు. కాగా, మొన్న హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు పోలీసులు.