Site icon NTV Telugu

Telangana Power Generation:శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ సీరియస్

Srisailam 1

Srisailam 1

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ జలజగడం మొదలయింది. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి నీళ్లొచ్చాయో లేదో….అప్పుడే ఏపీ, తెలంగాణ మధ్య వివాదం మొదలైంది. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి దిగువకు నీరు విడుదల చేయడం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ నిబంధనలు అతిక్రమించి శ్రీశైలం జలాలను వినియోగిస్తోందని కృష్ణ యాజమాన్యం బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది.

Bunny Vasu: నిర్మాత బన్నీవాసుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన సాగునీరు, తాగునీటి అవసరాలకు నిర్మించిన ప్రాజెక్టులకు నీరందాలంటే 854 అడుగుల నీటి మట్టం కొనసాగించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేయాలన్నా శ్రీశైలం డ్యామ్ లో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలి. శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 854 అడుగులు మెయింటెయిన్ చేయాలని కృష్ణ నది యాజమాన్యం బోర్డు కూడా సూచించింది. శ్రీశైలం జలాశయంపై ఆధారపడి, వరద జలాల ఆధారంగా నిర్మించిన మెజార్టీ ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించినవే. ఈ ప్రాజెక్టులకు నీరందాలంటే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం 874 అడుగులకు చేరాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ వరద నీటి మట్టం ను పట్టించుకోకుండా ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. రోజుకు సుమారు 3 టీఎంసీ లు విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూ దిగువకు విడుదల చేయడంపై రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు ఈనెల 13న వరద నీటి చేరిక ప్రారంభమైంది. అప్పటికి శ్రీశైలం ప్రాజెక్టులో 44.7394 టీఎంసీ ల నీటి నిలువ ఉంది. 15వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం ను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి దిగువకు విడుదల చేయడాన్ని ఏపీ ప్రభుత్వం కూడా తప్పు పడుతోంది. జలవనరుల శాఖ అధికారులు కృష్ణ నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టం నిబంధనను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభ్హత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయడాన్ని రాయలసీమ సాగునీటి సమితి వ్యతిరేకిస్తుంది. ఇది రాయలసీమకు శాపమని ఆందోళన వ్యక్తం.చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం లో అనుమతించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. వెనుకబడిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలంటే కృష్ణా జలాల నిర్వహణ సమగ్రంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Aam Aadmi Party: మధ్యప్రదేశ్‌లోనూ అడుగుపెట్టిన ఆప్.. మేయర్ పీఠం కైవసం

Exit mobile version