NTV Telugu Site icon

MLA Parthasarathy: 29 వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము

Mla Parthasarthy

Mla Parthasarthy

రాష్ట్రంలోని పేద వర్గాలకు జరిగిన లబ్ధి గురించి చెప్పేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర చేపట్టినట్టు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. గురువారం పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యత్రలో ఎమ్మెల్యే పార్థసారధి, వైసీపీ నేతలు రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 లక్షల మందికి 1299 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు. పేద వాళ్లకు 29 వేల పైచిలుకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, నియోజకవర్గంలో కాలువ గట్లలో నివసించేవారికి 75%సిమెంట్ రోడ్లు,నీటికుళాయిలు సౌకర్యాలు కల్పించామని చెప్పారు.

Also Read: AITUC Miryala Rangaiah : గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు

నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 30 వేల మైనారిటీ కుటుంబాల కోసం మూడు షాధికాణాలు నిర్మించడం జరిగిందని, R&B రోడ్లు75శాతం పూర్తి చేసామన్నారు. అలాగే మార్కెట్ యార్డులు ,PACS,CDC చైర్మన్లు అన్ని కూడా అణగారిన వర్గాలకు ఇవ్వడం జరిగిందని, బందరు కాలువలో పూడికతీత అన్ని ఈ ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేశామని వివరించారు. అనంతరం వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గరి నుంచి bc,sc,st లకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. విద్య,వైద్యం అన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో కి తీసుకురావడం జరిగిందని, బలహీన వర్గాలకు చెందిన నలుగురని రాజ్యసభ సభ్యులుగా పంపించారని చెప్పారు.

Also Read: RGV: నోరు జారిన రామ్ గోపాల్ వర్మ.. కేసు పెట్టిన బర్రెలక్క..

జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలియడం కోసం ఈ యాత్ర జరుగుతుందని, పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమన్నారు. అలాగే అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో రెండు సంవత్సరాలు ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫలాలు అందించామని, తలసరి ఆదాయంలో ఏపీ 197 నుంచి 9వ స్థానంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4.93 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, వ్యవసాయం రంగాన్ని కూడా ఈ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. విద్యలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీ పథకాల్లో భాగంగా 42 వేల కోట్లు పై చిలుకు ఖర్చు చేశామని, 17 మెడికల్ కాలేజీలు తెచ్చామన్నారు.