జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో వైయస్సార్ వాహనమిత్రా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా ఆటో నడిపారు.. ఇక, ఆ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. పవన్ కల్యాణ్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఆమె… పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు వేశారు.. ఇప్పుడు రోడ్ల పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజల హృదయాల్లో పవన్ కల్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా..
Read Also: Business Flash: పెరగలేని స్థితిలో.. పసిడి రేట్లు. అదిరే రేంజ్‌లో.. ‘అదానీ’ ప్లాన్లు.
ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం పనులు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులేనని ఆరోపించారు మంత్రి రోజా… రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి కారణం తెలుగుదేశం పార్టీయే.. కానీ, టీడీపీ, బీజేపీని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించరు ? అని నిలదీశారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం కోసం అప్పులు చేయడం లేదా..? అని ప్రశ్నించిన ఏపీ మంత్రి.. అప్పులు తెచ్చినా అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ డబ్బులు ఖర్చు పెడుతున్నారని స్పష్టం చేశారు. జనంలో తిరగని ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆరోపించారు.. ఇక, బీజేపీతో కలవాల్సిన అవసరం మాకు లేదని కుండబద్దలు కొట్టారు.. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తామని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.. కాగా, ఏపీలోని రోడ్ల పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. #GoodMorningCMSir హాష్ ట్యాగ్ ను జోడించి.. ఏపీలోని రోడ్ల పరిస్థితిని సూచించే వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు.