NTV Telugu Site icon

Minister RK Roja: క్విట్‌ చంద్రబాబు.. సేవ్‌ ఏపీ నినాదంతో ఎన్నికలకు..!

Rk Roja

Rk Roja

క్విట్‌ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్న ఆమె.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని సూచించారు.. 14 సంవత్సారాలు సీఎంగా వున్నా చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని కనీసం రెవెన్యూ డివిజన్‌గా కూడా చేయలేని అసమర్థుడు అంటూ ఫైర్‌ అయ్యారు. మేం ప్రజల్లో ధైర్యంగా తిరుగుతుంటే.. వాళ్లు మీడియా ముందు డ్యాన్సులు వేస్తున్నారు అంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.

Read Also: Airtel: ఛార్జీల వడ్డింపునకు సిద్ధమైన ఎయిర్‌టెల్..!