Site icon NTV Telugu

Minister Ramprasad Reddy: మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతాం..

Ramprasad Reddy

Ramprasad Reddy

Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో అమలు చేస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విశాఖ నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మేము కక్ష సాధింపులకి పోమని మంత్రి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్, ఇసుక అన్ని రంగాల్లో అవినీతి చేశారని.. కూలీ కుటుంబం నుండి వచ్చిన పెద్దిరెడ్డి ఇప్పుడు రాయలసీమను శాసించే స్థాయికి ఎదిగేంత అవినీతి చేశారని ఆయన ఆరోపించారు. జగన్ హయాంలో మంత్రులలాగా గంగిరెద్దుల్లా తలవూపుకుంటూ మేము పని చెయ్యమని.. మంత్రులకు చంద్రబాబు పూర్తి స్వేచ్చ ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సొమ్ము తిన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: PM Modi: ఏపీలోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో పండించే అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్..

Exit mobile version