Site icon NTV Telugu

ఏపీలో కేసీఆర్‌ పార్టీ పెట్టాలని కోరుకుంటాం: పేర్నినాని

ఏపీ మంత్రి పేర్నినాని కేసీఆర్ ఫ్లీనరీ సందర్భంగా మాట్లాడిన మాటలపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని కేసీఆర్‌ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేసీఆర్‌ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నామని, రెండు రాష్ట్రాలలో పార్టీ ఎందుకు, దానికన్నా తెలంగాణ క్యాబినెట్‌లో రెండు రాష్ట్రాలను కలిపే తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగంగా మాట్లాడారు. కేసీఆర్‌కు ఏపీలో పార్టీ పెట్టాలని అంత కోరికగా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని సైటైరికల్‌గా మాట్లాడారు.

Exit mobile version