NTV Telugu Site icon

హీరోయిజం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలొద్దు.!

Kannababu

Kannababu

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్ ను నమ్ముకొని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.. సీజన్ ముగిశాక చంద్రబాబుకు మామిడి రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేసిన ఆయన.. మూడు నెలలుగా మామిడి ఉత్పత్తుల మార్కెటింగ్ పై సమీక్ష చేస్తున్నామని.. ఎమ్మార్వో స్థాయి అధికారులకు మామిడి ఎగుమతులు, దిగుమతులపై పర్యవేక్షణ ఉండాలని ఆదేశించామని తెలిపారు.

also read కేసీఆర్‌ మొదట్లో ఫ్రెండ్లీగా ఉన్నారు.. ఇప్పటి వ్యవహారం నాకు నచ్చలేదు..!

రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ శాఖ దృష్టి సారించిందని తెలిపారు మంత్రి కన్నబాబు.. కరోనా కష్టకాలంలోనూ రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్న ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాలో మామిడి బోర్డును ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు.. మార్క్ ఫెడ్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశాం.. రైతులు నష్టపోతున్నారని తెలిసి ప్రభుత్వమే ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తోందని.. చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర ఇవ్వడానికి మేం చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.. ప్రాసెసింగ్ యూనిట్లను ఎప్పటికప్పుడు అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు విజిట్ చేస్తున్నారన్న ఆయన.. రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం అవాస్తవమని కొట్టిపారేశారు. ఏపీ రైతులు దగ్గర ఉత్పత్తులు బాగున్నాయని కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చి కొనుగోలు చేశారని తెలిపారు మంత్రి కన్నబాబు.