Site icon NTV Telugu

దేవాదాయ భూముల్ని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదు..!

Kannababu

దేవాదాయశాఖ భూములని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో తాగుబోతుల తరపున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టీడీపీనే అంటూ ఎద్దేవా చేశారు. నిత్యావసరాల రేటు పెరిగితే ఆందోళన చెందాల్సిన ప్రతిపక్షం మందు రేట్లు పెరిగితే మాట్లాడడం కరక్టెనా…? అని ప్రశ్నించిన ఆయన.. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని సీఎం ముందే చెప్పారన్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. సుదీర్ఘకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేయసిన యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, టీడీపీ హయంలో అప్పులు చేయలేదా…? అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు.. లక్షల అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు, యనమల ఏం చేశారని నిలదీసిన ఆయన.. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.. దేశం మొత్తం విద్యుత్ కొరత ఉంది.. కానీ, ఆ సమస్యను ఏపీకే టీడీపీ నాయకులు పరిమితం చేయం దుర్మార్గం అన్నారు.. రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుదుదేనని ఎద్దేవా చేసిన కన్నబాబు.. టీడీపీ హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్ధిక సహకారం చేసుకపోవడం వలనే ఆ ప్రభావం డిస్కమ్‌లపై పడిందన్నారు. చంద్రబాబు అనుభవం తనను నమ్ముకున్న వాళ్ళకే పనికొచ్చింది.. పేదల కష్టాలు తెలిసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు.. టీడీపీ నాయకులు ఆర్ధిక నేరాలు బయట పడకూడదనే నలుగురు ఎంపీలను బీజేపీకి అప్పగించారని ఆరోపించిన ఆయన.. ఎటువంటి సంక్షోభం లేకుండా చేసే అనుభవం జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు మంత్రి కన్నబాబు.

Exit mobile version