దేవాదాయ భూముల్ని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవాదాయశాఖ భూములని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో తాగుబోతుల తరపున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టీడీపీనే అంటూ ఎద్దేవా చేశారు. నిత్యావసరాల రేటు పెరిగితే ఆందోళన చెందాల్సిన ప్రతిపక్షం మందు రేట్లు పెరిగితే మాట్లాడడం కరక్టెనా…? అని ప్రశ్నించిన ఆయన.. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని సీఎం ముందే చెప్పారన్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. సుదీర్ఘకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేయసిన యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, టీడీపీ హయంలో అప్పులు చేయలేదా…? అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు.. లక్షల అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు, యనమల ఏం చేశారని నిలదీసిన ఆయన.. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.. దేశం మొత్తం విద్యుత్ కొరత ఉంది.. కానీ, ఆ సమస్యను ఏపీకే టీడీపీ నాయకులు పరిమితం చేయం దుర్మార్గం అన్నారు.. రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుదుదేనని ఎద్దేవా చేసిన కన్నబాబు.. టీడీపీ హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్ధిక సహకారం చేసుకపోవడం వలనే ఆ ప్రభావం డిస్కమ్‌లపై పడిందన్నారు. చంద్రబాబు అనుభవం తనను నమ్ముకున్న వాళ్ళకే పనికొచ్చింది.. పేదల కష్టాలు తెలిసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు.. టీడీపీ నాయకులు ఆర్ధిక నేరాలు బయట పడకూడదనే నలుగురు ఎంపీలను బీజేపీకి అప్పగించారని ఆరోపించిన ఆయన.. ఎటువంటి సంక్షోభం లేకుండా చేసే అనుభవం జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు మంత్రి కన్నబాబు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!