టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు.. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయాలు వదిలేస్తారా..? అని ప్రశ్నించారు అవంతి శ్రీనివాస్.. రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయో? లేదో..? మీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందంటూ చంద్రబాబుకు హితవుపలికిన ఏపీ మంత్రి… హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకి మంత్రి అవంతి సవాల్.. నిరూపిస్తే రాజీనామా..!

Avanthi Srinivas