NTV Telugu Site icon

నీకు, నీ కొడుకుకి దమ్ముంటే పలాస రండి.. బాబుకు మంత్రి అప్ప‌ల‌రాజు స‌వాల్

Appalaraju

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌కు స‌వాల్ విసిరారు ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. శ్రీ‌కాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. హైరాబాద్‌లో ఉండి ప్ర‌భుత్వంపై లేనిపోని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు.. చంద్రబాబుకు సిగ్గుంటే ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల‌ని డిమాండ్ చేశారు. ఇక్కడున్న వైద్య సదుపాయాలు పరిశీలిస్తే నీకే తెలుస్తుంద‌ని హిత‌వుప‌లికారు.. నీ హయాంలో వైద్య సౌకర్యాలను ఎంత సంకనాకించేశావో మాకు తెలుసు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మంత్రి అప్ప‌ల‌రాజు.. నీకు, నీ కొడుకుకి దమ్ముంటే పలాస రండి.. ఈ రెండేళ్లలో పలాసలో మేం ఏంచేశామో చూపిస్తాం అంటూ బ‌హిరంగ స‌వాల్ విసిరారు.. ఎక్కడో ఉండి.. ఈ రాష్ట్రంలోని మా ప్రభుత్వంపై బురదజల్లడం నీచమైన చ‌ర్య అంటూ మండిప‌డ్డారు మంత్రి.