Site icon NTV Telugu

అవినీతి ఆరోపణలు.. సీరియస్‌గా స్పందించిన మంత్రి అనిల్‌

Anil Kumar

Anil Kumar

ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు కలకలం సృష్టించాయి.. ఇక, తనపై ఆరోపణలపై సీరియస్‌గా స్పందించారు మంత్రి అనిల్‌.. ఇసుక దుమారంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు.. మంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి టిడిపి మినహా అన్ని పార్టీలు హాజరు కాగా.. రేపు భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పరివాహక ప్రాంతంలో అఖిలపక్షం సభ్యులు పర్యటించనున్నారు.. అయితే, అనుమతులు లేకుండా ఇసుకను తరలించిన మాట వాస్తవమేనని అఖిల పక్ష సభ్యుల చెబుతున్నారు.. కానీ, ఇసుక తరలింపు వ్యవహారంలో మంత్రి అనిల్ పాత్ర ఉందో లేదో మరో 24 గంటల్లో తేలే అవకాశం ఉందంటున్నారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. రోజు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు.. స్పందించాల్సిన అవసరం లేదన్నారు.. చెత్త ,చెదరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ఇసుక రీచ్ వద్ద అనవసరంగా రాజకీయ సన్యాసం చేసుకుంటాను అన్నారు కొందరు అని సెటైర్లు వేశారు.

రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు అన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్.. ఇసుక వ్యవహారంలో నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరిన ఆయన.. దిగజారుడు తనంతో నేను బ్రతకలేనన్నారు.. రేపు ఉదయం అన్ని పార్టీలతో పాటు.. మా పార్టీ నుండి కూడా ఇద్దరి పంపిస్తాను.. పని చేస్తే ఆలోచనతో చేయాలి అని హితవుపలికారు.. నేను ఎప్పుడూ వ్యాపారుల దగ్గర డబ్బులు వసూళు చేయలేదన్న ఆయన.. ఆ మట్టితో ఎవరూ ఇల్లు కట్టుకోలేరన్నారు.. నేను వైఎస్‌ జగన్ శిష్యరికంలో రాజకీయం చేస్తున్నాను.. రాజకీయాలు చేస్తే మగాడిలా చేస్తాను అన్నారు. నేను అక్రమాలు చేస్తే నన్ను 2024 ఎన్నికల్లు ఓడిస్తారు అన్నారు మంత్రి అనిల్‌ కుమార్.. వైఎస్సార్ జెండా కోసం ఏమైనా చేస్తానన్న ఆయన.. ప్రతిపక్షం వారు నెల్లూరులో సంచులు తీసుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంచుల వెనుక ఎవరైనా ఉండొచ్చు… లోకేష్ కూడా ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు.

Exit mobile version