NTV Telugu Site icon

Ambati Rambabu: చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. అయితే, ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు 2018 లోపలే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారుగా.. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు.? అని ప్రశ్నించారు. నాకు మిడిమిడి జ్ఞానం ఉందని చంద్రబాబు మీడియా వార్తలు రాసింది అని ఫైర్‌ అయ్యారు.. దెబ్బతిన్న డయాఫ్రమ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వెల్లడించిన అంబటి.. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించింది.. వారు ఇచ్చే సూచనల కోసం ఎదురు చూస్తున్నాం.. కానీ, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి కారణం ఎవరు?? చంద్రబాబు ప్రణాళికా రహితంగా వెళ్ళటం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు.

Read Also: Kakani Govardhan Reddy: నల్లపురెడ్డితో మంత్రి కాకాణి భేటీ.. విషయం ఇదే..!

గోదావరి నది నీటిని మళ్లించి, స్పిల్ వే ఛానల్ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి.. కానీ, చంద్రబాబు ఒకేసారి అన్ని పనులు చెయ్యటం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు అంబటి రాంబాబు.. ఈ విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని విమర్శించారు. ఇక, 35 కాంటూరు దగ్గర గ్రామాలకు పునరావాసం కల్పించాం.. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే పూర్తి చేసి నదీ మార్గాన్ని మళ్ళించామని తెలిపారు.. రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేశామన్నారు. మరోవైపు, నాగార్జునసాగర్ విషయంలో తెలియక కొంత పొరపాటు పడిన మాట వాస్తవం.. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలోనూ డయాఫ్రమ్ ఉంటుంది అనుకున్నా… తెలియనివి తెలుసుకుంటా అన్నారు. దేవినేని ఉమా గురించి అదో, ఇదో తెలియదు అంటున్నారు… వైద్యులకు చూపించుకోవటం మంచిదని సెటైర్లు వేశారు. డయాఫ్రమ్ వాల్ పడిన గుంతలు పూడ్చడానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది.. నీళ్లు తోడాలంటే 2వేల కోట్లు ఖర్చు అవుతుంది.. ఈ పాపం చంద్రబాబుది కాదా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.