NTV Telugu Site icon

విలువలులేని రాజకీయం.. గెలిచిన పార్టీని, సీఎంని విమర్శించడం దుర్మార్గం..

Adimulapu Suresh

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది… రెబ‌ల్ ఎంపీపై మండిప‌డుతోన్న వైసీపీ నేత‌లు.. ఆయ‌న అరెస్ట్‌ను స‌మ‌ర్థిస్తూ వ‌స్తున్నారు.. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలిచిన పార్టీని, సీఎంని విమర్శించడం దుర్మార్గం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. రఘురామకృష్ఱంరాజు విలువలు లేని రాజకీయం చేశాడంటూ ఫైర్ అయిన ఆయ‌న‌.. సంవత్సరం నుండి రాష్ట్రంతో సంబంధాలు కోల్పోయాడ‌ని.. ధైర్యంగా ఆయన నియోజకవర్గానికి రాలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. మ‌రోవైపు.. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తే సీఐడి పరిధిలోకి వస్తుంద‌న్న మంత్రి సురేష్.. ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసి తప్పులేంటో సెక్షన్ల ప్రకారం చెబుతున్నాం.. సమాజంలో అలజడి రేకెత్తించే విధంగా ఆయ‌న పని చేశారు.. చట్టం ఎవరికీ చుట్టం కాద‌ని వ్యాఖ్యానించారు.