CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- 'మీ భూమి-బ్లాక్ చెయిన్'కు సీఎం చంద్రబాబు శ్రీకారం
- ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
- డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. డిజిటల్ భద్రత
- నవంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : రాష్ట్రంలో భూ రికార్డుల భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ, భూ వివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెవెన్యూ శాఖ రూపొందించిన ఈ ఆధునిక సాంకేతిక విధానం ద్వారా ప్రతి ల్యాండ్ పార్సెల్‌కు ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయించనున్నారు. దీనివల్ల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలుండదు. ప్రధానంగా డబుల్ రిజిస్ట్రేషన్ల సమస్యలను అరికట్టడంతో పాటు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తెస్తూ భూ లావాదేవీలలో ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు
ఎన్ఐసీ ఆంధ్రప్రదేశ్ , బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ’ సంస్థలు సంయుక్తంగా ‘హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్’ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. తొలిదశలో భాగంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని ఒక్కో మండలంలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా అమల్లోకి తెచ్చారు. కర్నూలు (ఆస్పరి), చిత్తూరు (పెనుమూరు), బాపట్ల (రేపల్లె), కృష్ణా (గన్నవరం), తూర్పు గోదావరి (కడియం), పార్వతీపురం మన్యం (గుమ్మలక్ష్మీపురం), విజయనగరం (కొత్తవలస) మండలాల్లోని 89 రీ-సర్వే గ్రామాలకు చెందిన 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రారంభోత్సవంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
భూ సమస్యలకు ముగింపు పలకడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో లోపాల వల్ల అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ’22ఏ’ పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో వివాదాలు మరింత పెరిగాయని విమర్శించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ల్యాండ్ లిటిగేషన్లు తక్కువే అయినప్పటికీ, రికార్డులను ప్రక్షాళన చేస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజముద్ర వేసి ఇస్తున్నామని తెలిపారు. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలకు తమ ప్రభుత్వం విముక్తి కల్పించిందని గుర్తుచేశారు.
నవంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
ప్రస్తుతం ప్రారంభించిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అమలును రెండు నెలల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విధానంలో ఏవైనా సాంకేతిక లోటుపాట్లు ఉంటే వాటిని నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక కంప్లైంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి నుంచి సర్వే పూర్తయిన గ్రామాలన్నింటినీ ఈ బ్లాక్ చెయిన్ పరిధిలోకి తీసుకెళ్తామని, నవంబర్ నాటికి ఈ సాంకేతికతను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. భూ సమస్యలన్నీ పరిష్కారమైతే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!