తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. లారీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులు, డ్రైవర్లకు తీవ్రమైన ఇబ్బందులను కలుగుతాయని ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి లేఖ రాశారు.
ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంట్లో 12 సంవత్సరాల పైబడిన వాహనాలపై తీవ్రమైన పరిమితులు విధించబడ్డాయి. దీనివల్ల లారీలపై ఆధారపడి జీవిస్తున్న వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వల్ల సంభవించే సమస్యల పరిష్కారానికై లారీ ఓనర్స్ లేవనెత్తిన డిమాండ్స్ చూసినట్లతైతే.. లక్షలాది మంది ఓనర్-కమ్- డ్రైవర్లు తమ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నిబంధనలు అమలైతే వారు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
Also Read:Hydra: తూముకుంట మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేత… ప్రకృతి రిసార్ట్స్ నేల మట్టం
వారి కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. పాత వాహనాలను నిషేధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు రవాణా ఛార్జీలు పెరిగి ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ PDS, ఇతర ప్రజా సేవలకు అంతరాయం కలుగుతుంది. అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ATS పూర్తిగా రద్దు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో నడిపేలా చూడాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం వాహన యజమానులపై ఆర్ధిక దోపిడీకి దారితీస్తోంది. కొత్త నిబంధనల వల్ల లక్షలాది వాహన యజమానులు ఆర్థికంగా నష్టపోతారు, వారిపై అదనపు భారం పడుతుంది. వాహన యజమానులు ఇప్పటికే అతిగా వసూలు చేస్తున్న టోల్ చార్జీలపై అసంతృప్తిగా ఉన్నారు.
Also Read:AP MLC Elections 2025: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు..
కొత్త నిబంధనలు మరింత భారం పెంచి కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే ప్రమాదం ఉంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో సంవత్సరముల వారీగా విధించిన అధిక ఫిట్నెస్ ఫీజులను పూర్తిగా తొలగించాలి. బదులుగా చిన్న, మీడియం వాహనాలకు 500లు, హెవీ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలకు రూ.1,000లు ఫీజును మాత్రమే నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేయాలని లేదా వాహన యజమానులకు ఆర్ధిక భారం పడకుండా సవరించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది ప్రజల జీవనోపాధికి సంబంధించిన దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.