NTV Telugu Site icon

Home Minister Taneti Vanitha: ఏపీలోనే అత్యధికంగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం..!

Home Minister Taneti Vanith

Home Minister Taneti Vanith

దేశ వ్యాప్తంగా సాగుతున్న స్మగ్లింగ్‌లో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అంటున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత . ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సమర్థతే దీనికి కారణమని, పోలీసు యంత్రాంగం మెరుగైన పనితీరు ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, మత్తు పదార్థాలు రవాణాను ఆరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన హోంశాఖ మంత్రి తానేటి వనిత… రాష్ట్రంలో గంజాయి రవాణాశాఖ ఆరికట్టడానికి మా సర్కార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.. గంజాయి సాగే జీవనాధరంగా జీవిస్తున్న గిరిజనల్లో అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు..

Read Also: Kakani Govardhan Reddy: బాబు చేసిన పాపాలు రైతులకు శాపాలుగా మారాయి.. దమ్ముంటే చర్చకు రావాలి

కాగా, దేశంలో 2021-22 సంవత్సరంలో డ్రగ్స్‌ని అత్యధిక స్థాయిలో ఆంధ్రలోనే స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం విదితమే.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో తయారుచేసిన నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం హస్తినలో విడుదల చేశారు.. ఆ నివేదిక ప్రకారం సీఆర్పీఎఫ్‌ 2021-22 సంవత్సరంలో అత్యధికంగా ఏపీలో 18,267.84 కిలోలు, ఆ తర్వాత త్రిపురలో 10,104.99 కిలోలు, అస్సోంలో 3,633.08 కిలోలు, తెలంగాణలో 1,012.04 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.. ఇక, బ్రౌన్‌ షుగర్‌, హెరాయిన్‌, ఓపియం, మార్ఫిన్‌, గంజాయి వంటివి ఇందులో ఉన్నాయి.. డీఆర్‌ఐ నేతృత్వంలో ఏపీలో 1,057 కిలోల గంజాయి, హైదరాబాద్‌లో 3.2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.