Site icon NTV Telugu

Home Minister Taneti Vanita: గోరంట్ల మాధవ్‌ని మేం రక్షించడం లేదు.. నిజమని తేలితే శిక్ష..!

Minister Taneti Vanita

Minister Taneti Vanita

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి తానేటి వనిత… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విచారణలో ఉందని తెలిపారు.. ఫోరెన్సిక్ నివేదిక త్వరగానే వస్తుందని.. అది నిజమని తేలితే శిక్ష, చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు… అయితే, ఈ ఎపిసోడ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. టీడీపీ మహిళా నేతలు మాటలు, బాడీ లాంగ్వేజ్ దారుణంగా ఉన్నాయన్న ఆమె.. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు తమ శాడిజం అంతా చూపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Chandrababu: ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్‌.. చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

మూడేళ్లలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని అనడానికి ఏమీ లేవు.. కానీ, ఏదో ఒక ఇష్యూలో సీఎంను టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి తానేటి వనిత… మరోవైపు, మార్ఫింగ్ వీడియో అని ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఫిర్యాదు చేశారని వెల్లడించారు.. ఇక, టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయని విమర్శించిన ఆమె.. తమ హయాంలో దిశ యాప్ ద్వారా 900 మహిళల్ని రక్షించామని వెల్లడించారు.. గోరంట్ల మాధవ్ ని ప్రభుత్వం రక్షించడం లేదని స్పష్టం చేశారు తానేటి వనిత.. తమ ఎంపీని తాము కాపాడుతున్నట్టు, ఆయన వల్ల బాధింపబడిన మహిళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళా నేతలు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనించుకోవాలని హితవు పలికారు. ఆ మహిళానేతలు వాడే పదజాలం రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుపడేలా ఉందన్న ఆమె.. ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు..

Exit mobile version