ఏపీలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విస్తరణాధికారుల ఉద్యోగ నియామకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విస్తరణాధికారుల నియామకాల పై హైకోర్టు స్టే విధించింది. గతంలో 560 విస్తరణాధికారులు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ. రాత పరీక్షలు నిర్వహించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టును నిలిపేసింది ప్రభుత్వం..ముందుగా అభ్యర్ధులను ఎంపిక చేసుకొని, వారికే ల్యాంగ్వేజ్ టెస్ట్ పెట్టారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కో విస్తరణాధికారి నియామకానికి పది లక్షలు వసూలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
Read ALso: Urvasivo Rakshasivo Teaser: అల్లు శిరీష్ ఇంట్లో బుద్ధిమాన్… బయట శక్తిమాన్!
నిన్న వేసిన లంచ్ మోషన్ పిటీషనుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని.. అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం అన్ని జోన్లలో నియామక ప్రక్రియపై స్టే విధించింది హైకోర్టు. ఆరు వారాల్లో స్టే వెకేషన్ అనంతరమే నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు విచారణను హైకోర్ట్ వాయిదా వేసింది.