Site icon NTV Telugu

గ్రూప్ 1 ఇంట‌ర్వ్యూల‌పై ఏపీ హైకోర్టు స్టే..

AP High Court

గ్రూప్‌-1 పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ 4 వారాల పాటు నిలిపివేయాలని స్టే విధించింది.. రేప‌టి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.. కాగా, గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జ‌రిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. ఇక‌, దీనిపై మంగ‌ళ‌వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదోప‌వాద‌లు జ‌ర‌గ‌గా.. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు.. మంగ‌ళ‌వారం తీర్పును రిజ‌ర్వు చేసి ఇవాళ తీర్పు వెలువ‌రిస్తూ.. 4 వారాల పాటు స్టే విధించింది.

Exit mobile version