Site icon NTV Telugu

AP High Court: జడ్జీలను దూషించిన కేసు.. యుట్యూబ్‌పై హైకోర్టు సీరియస్

సోషల్‌ మీడియాలో జడ్జీలను దూషించిన కేసులో యుట్యూబ్‌ పై సీరియస్‌ అయ్యింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కొత్త టెక్నిక్‌తో పంచ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది అశ్వని కుమార్‌… అమెరికాలో ఉన్న పంచ్‌ ప్రభాకర్‌ ప్రైవేటు యూజర్‌ ఐడీ పెట్టుకొని.. అడిగిన వారికి వ్యూస్‌ ఇస్తున్నారని కోర్టుకు వివరించారు.. ప్రైవేట్‌ వ్యూస్‌ని ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవపరుస్తున్నారంటూ తన అఫడవిట్‌లో పేర్కొన్నారు..

Read Also: Goutham Reddy passes away: మృతిపై అసత్య ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ

ఇక, సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పంచ్‌ ప్రభాకర్‌ గురించి ప్రస్తావించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు… పంచ్‌ ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారని ఈ సందర్భంగా సీబీఐని ప్రశ్నించింది… అయితే, అమెరికాలో ఉండడంతో ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. దీంతో.. మార్చి 21వ తేదీలోపు ప్రభాకర్‌ అరెస్ట్‌కు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో హైకోర్టుకి నివేదించాలని కోరిన ధర్మాసనం.. ప్రైవేట్‌ వ్యూస్‌ నిషేధించడానికి తీసుకుంటున్నచర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

Exit mobile version