NTV Telugu Site icon

AP High Court: ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టు విచారణ

Ap High Court

Ap High Court

అమరావతి: ప్రభుత్వ జీఓలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడంపై దాఖలపై పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పటిషనర్ల వాదన విన్న న్యాయస్థానంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారించిన కోర్టు జీవోలను RTI ద్వారా పొందవచ్చు కదా అని పటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా.. జీవోలు విడుదలయినట్లు కూడా తెలియడం లేదని, అటువంటప్పుడు ఆర్‌టీఐ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జి.వోలను ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం పౌరుల ప్రాధమిక హక్కులకు విఘాతం కలిగించడమే పటిషనర్లు పేర్కొన్నారు.

Also Read: Couple Sells Everything: క్రూయిజ్ షిష్‌లో ప్రపంచ పర్యటన.. ఆస్తులన్నీ అమ్మేసుకున్న జంట

దీంతో పిటీషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ప్రభుత్వ న్యాయవాది తొసిపుచ్చారు. పిటిషనర్లు చెబుతున్న దానిలో వాస్తవం లేదని, గతంలో సంతకాలు లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేవారన్నారు. ఇప్పుడు సంతకాలతో అప్‌లోడ్ చేస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్డుకు వివరించారు. దీంతో జీవోలో రాజ్యాంగపరమైన సమస్యలున్నందున ఈ అంశానికి సంభందించిన ఇతర తీర్పు ప్రతులను బెంచ్ ముందుంచాలని పిటీషనర్ల న్యాయవాదులను కోర్డు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Also Read: MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు