వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి… అయితే, ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు.. దీనిపై స్పందించిన హైకోర్టు.. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది హైకోర్టు.. అయితే, ప్రాథమిక విచారణ, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని హైకోర్టుకు విన్నవించారు రఘురామకృష్ణంరాజు న్యాయవాది.. ఎంపీ హోదాలో ఉన్న వ్యకిని సహేతుక కారణాలు లేకుండా రిమాండ్ కి ప్రవేశ పెట్టాలనుకోవడం చట్టవిరుద్దమని వాదించారు.. ఇక, ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.
రఘురామ కృష్ణం రాజు పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. సూటి ప్రశ్న..!
Raghu Rama Krishnam Raju