AP High Court: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాలు చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై ఇవాళ (మంగళవారం) హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పెంచకుండానే జోవో ఇచ్చారు.. సీట్లు పెంచిన తర్వాతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకుర్ వాదించారు. లేదంటే ఓపెన్ కేటగిరీ వాళ్లు పూర్తిగా నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇక, ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోపై తదుపరి విచారణ 6 వారాలకి వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.
AP High Court: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేత
- వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు..
- ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోపై తదుపరి విచారణ 6 వారాలకి వాయిదా..
Show comments