Site icon NTV Telugu

High Court: టీటీడీ ఈవోకు హైకోర్టులో ఊరట.. జైలుశిక్ష, జరిమానాపై స్టే

Dharma Reddy

Dharma Reddy

High Court: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. తమను క్రమబద్ధీకరించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలంటూ ముగ్గురు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. వారిని క్రమబద్ధీకరించాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగింది.

Read Also: Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన.. ఈ సీల్ చేప వేషాలు చూస్తే షాకే

ఈ నేపథ్యంలో ఉద్యోగులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సింగిల్ జడ్జి ధర్మాసనం నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ అంశంపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ జడ్జి తీర్పుపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది.

Exit mobile version